Header Banner

సెక్స్ వర్కర్ల సంఖ్యపై అంకెల గారడి! డబ్బులకు కక్కుర్తి పడ్డ ఆ NGO సంస్థలు! సంబంధిత అధికారులను శిక్షించాలి!

  Wed Jun 11, 2025 08:05        Exclusives

ఆంధ్ర ప్రవాసి ఎక్స్ క్లూజివ్ ఆర్టికల్:

 

Article by: V. గాంధీ బాబు
సామాజిక కార్యకర్త
(డైరెక్టర్ - ASDS)

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెక్స్ వర్కర్లకు అడ్డాగా మారిందని NACO జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇటీవల ప్రకటించింది... ఈ అంశం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమరం రేపుతుంది. అసలు NACO ప్రకటించిన ఈ అంకెల వెనకాల ఎంత నిజాయితీ ఉంది ? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది?

NACO సహకారంతో దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా APSACS ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పేరుతో ఓ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి దాన్ని ద్వారా నిధులను స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తూ ఎయిడ్స్ నివారణ చర్యలు చేపడుతూ , ఎయిడ్స్ పై ప్రచారం నిర్వహిస్తూ ఉంది.


రాష్ట్రంలో APSACS నిధులతో పనిచేస్తూన్న స్వచ్ఛంద సంస్థలు తమ target Intervention క్రింద తప్పనిసరిగా 800 మంది నుంచి వెయ్యి మంది సెక్స్ వర్కర్లను నమోదు కాబడి ఉండాలి. అలాగే ప్రతి ఏడాది సగటున ప్రతి స్వచ్ఛంద సంస్థల కనీసం 10 నుంచి 15% తమ target Intervention లో అదనంగా సెక్స్ వర్కర్లును నమోదు పెంచుతూ ఉండాలి. అలాగే 50 ఏళ్ల వృద్ధ మహిళ సెక్స్ వర్కర్ల పేర్లు ను కూడా అ నమోదు నుంచి తొలగిస్తూ ఉండాలి. ప్రతి సెక్స్ వర్కర్ యొక్క ఆధార్ కార్డ్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు సంస్థ సేకరించాల్సిన బాధ్యత ఆయా స్వచ్ఛంద సంస్థలపై ఉంది.

 

ఇది కూడా చదవండి:  నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అలాగే APSACS నుంచి జిల్లా పర్యవేక్షణకు వచ్చే అధికారుల ప్రతి పర్యటనలో కనీసం 10 నుంచి 15% సెక్స్ వర్కర్లు ను స్వయంగా కలిసి డేటా సరిచుడవలిసి ఉంది. కానీ ఇది తూతూ మంత్రంగా మారింది పైగా గత రెండు ఏళ్ళ నుంచి APSACS ప్రోగ్రాం అధికారుల పర్యవేక్షణలో పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా కొత్త సెక్స్ వర్కర్లు సంఖ్య ప్రతి ఏట పెరుగుతూ పోతూ ఉన్నాయి... కాని వయసు 50 మించిన సెక్స్ వర్కర్ల సంఖ్య ను కూడా తగ్గించడం మర్చిపోయారు అందుకు కారణం సెక్స్ వర్కర్లు సంఖ్య తగ్గితే NGO స్టాప్ సంఖ్య, బడ్జెట్ నిధులు తగ్గిపోతాయి కనుక ఆ సంఖ్య తగ్గదు.

 

APSACS అంకెల గారడి
2020 జూన్ నెలలో ఒక లాయర్ RTI చట్టం ద్వారా APSACS ను రాష్ట్రం లో ని సెక్స్ వర్కర్స్ వివరాలు అడిగితే (RC No. 235/APSACS/2020 dt 23-06-2020) రాష్ట్రంలో 13 జిల్లాల్లో 90,649 మంది సెక్స్ వర్కర్లు, గుంటూరు జిల్లాలో 10,962 కృష్ణాజిల్లాలో 13,721 మంది ఉన్నారు అని తెలిపారు.

 

అదే వ్యక్తి పూర్తి వివరాలు ఇవ్వమని అడిగారు అందుకు response గా RTI response RC No 273/APSACS/2020 dt 18/09/2020 ద్వారా రాష్ట్రంలో 13 జిల్లాలో 1,00.109 ఉన్నట్లు పేర్కొన్నారు. అంటే నెలలో వ్యవధిలో పదివేల మంది సెక్స్ వర్కర్లు సంఖ్య పెరిగింది. గుంటూరు జిల్లాలో 10, 969మంది కృష్ణా జిల్లాలో 15,471మంది అంటే కృష్ణ జిల్లాలో మూడు నెలల వ్యవధిలో 2000 మంది పెరగడం గమనార్థం. గుంటూరు జిల్లాలో ఉన్న 10,969 అంది సెక్స్ వర్కర్స్ గాను 1516 మంది YSR ఫంక్షన్ కానుక స్కీమ్ కు అర్హులుగా 3,614 మంది అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కు అర్హులుగా గుర్తించారు అంటే మొత్తం 5,130 మంది వృద్ధులను తగ్గిస్తే మొత్తం 5,839 మాత్రమే ఉన్నట్లు అంటే లెక్కలు మొత్తం ఎంత గందరగోళంగా ఉందో అర్థమవుతుంది.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అలాగే రాష్ట్ర మొత్తం అటల్ పెన్షన్ యోజన పథకం అర్హులు 26,078 గ పేర్కొన్నారు. YSR ఫంక్షన్ కానుక స్కీమ్ కింద 9,671 నంది మహిళలు అంటే మొత్తం 35,749 మంది మహిళలు 60 ఏళ్లు పూర్తి చేసిన వృద్ధులు గా ఉన్నారు అంటే మొత్తం సెక్స్ వర్కర్స్ లో 1,00,109 లో 35,749 వృద్ధులు కాదా మిగిలిన వాళ్ళు అంటే 64,360 మంది మాత్రమే నిజమైన సెక్స్ వర్కర్స్.

 

ఏది నిజం ?.

APSACS జూన్ 2020లో రాష్ట్రంలో 90 649 సెక్స్ వర్కర్స్ ఉన్నట్లు ఇచ్చారు ఒక్క APSACS వాళ్ల 2020 సెప్టెంబర్ లో ఇచ్చిన జాబితాలో రాష్ట్రంలో 1,00,19 సెక్స్ వర్కర్లు గా పెరిగినట్లు చూపించారు.. 2022 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన నివేదిక ప్రకారం 1.33 లక్షల ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్లు ఉన్నారు. ఈ నెలలో NACO విడుదల చేసిన లెక్కలు ప్రకారం 2024 నాటికి దేశంలో ఉన్న 10 లక్షల మంది సెక్స్ వర్కర్స్ లో సగం పైగా ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ ,కర్ణాటక మహారాష్ట్ర మరియు ఢిల్లీలో మాత్రమే ఉన్నారు.

పై అంకెలు గారడే అంకెల్లో మాత్రమే కనిపిస్తున్నాయి NACO నుంచి నిధులు పొందడానికి APSACS department అలాగే APSACS నుంచి నిధులు పొందడానికి NGOs ఎత్తుకు పైఎత్తులు వేస్తూ సెక్స్ వర్కర్స్ సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు కానీ నిజమైన అర్హులు సెక్స్ వర్కర్ల సంఖ్య వెలుగులోకి రావడం లేదు.

 

ఇది కూడా చదవండి: లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

డిమాండ్స్.

1. తక్షణమే *మూడవ సంస్థ* ద్వారా ప్రతి NGO.TI project లో ఉన్న సెక్స్ వర్కర్స్ కు అనుగుణంగా వారిలో 25% మంది సెక్స్ వర్కర్స్ ని నేరుగా కలిసి వారి వివరాలు సేకరించాలి.
2. 45 ఏళ్ల దాటిన వృద్ధ సెక్స్ వర్కర్స్ ను జాబితాలో నుంచి తొలగించి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వృద్ధాప్య పెన్షన్లు వంటివి APSACS ద్వారా ప్రతి నెల అందేలా చూడాలి.
3. అర్హులైన సెక్స్ వర్కర్లను గుర్తించి వారికి తగిన గుర్తింపు కార్డులు అందించే వారికి ప్రత్యామ్నయ ఉపాధి అవకాశాలు కల్పించి వారు ఆ వృతి నుంచి బయటకు తీసుకొని రావాలి.
4. రాష్ట్రంలో సెక్స్ వర్కర్లు 81,116 మంది పొదుపు సంఘాల్లో సబ్యులు గా ఉన్నట్లు 2020 జూన్ APSACS తన నివేదికలో పేర్కొన్నది. కావున ఆ సబ్యులకు మెప్మా ద్వారా వెంటనే ప్రత్యన్మయ ఉపాధి పథకాలకు నిధులు అందించాలి.
5. దొంగ లెక్కలు ప్రకటిస్తున్న APSACS అధికారులపై వెంటనే చర్యలు చేపట్టాలి.

 

మొత్తం మీద నాకో ప్రకటించిన సెక్స్ వర్కర్స్ లెక్కలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాన్ని ఒక కుదుపు కుదిపింది... . ఏ మహిళా వ్యభిచారం చేయాలని కోరుకోదు....సమాజం చే వెలివేయబడి ...పొట్ట కూటికోసం తప్పని పరిస్థితుల్లో తమ శరీరాన్ని అమ్ముకొనే భాదిత మహిళల పై జాలి, కరుణ తో పాటు కనీస మానవత్వం కూడా చూపకుండా తమ రాజకీయ క్రీడల కోసం అ భాదిత మహిళ లను నడిరోడ్ పై లాగి ఇంకా అవమానించడం ...భాదకారం... ఇప్పటికే అయినా రాష్ట్ర ప్రభుత్వం APSACS లెక్కలు పై సమగ్ర విచారణ జరిపి ..తప్పుడు లెక్కలు చూపుతున్న వ్యక్తులు, సంస్థలు పై కటిన చర్యలు తీసుకోవాలి.

భారత దేశంలో మహిళ లకు అగ్రస్థానం ఉంది. మనం మహిళను దేవత మూర్తి గా కూడా చూస్తూ ఉంటాం....అటువంటి మహిళాలను కించ పరుస్తూ మాట్లాడటం తగదు.....అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.

 

ఇది కూడా చదవండి:  ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!

 

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

ఏపీలో ఆ ఉద్యోగులకు బదిలీలు! త్వరలో ఉత్తర్వులు జారీ!

 

ఆయన మూర్ఖుడిలా మాట్లాడారు.. వైసీపీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది! షర్మిల ఫైర్‌..

 

ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్! రూ.50 లక్షల విరాళం...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

బడ్జెట్ ట్రావెల్ కు బెస్ట్ డెస్టినేషన్లు! టాప్ 10 దేశాలు ఇవే! రోజుకి కేవలం..

 

ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!

 

ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!

 

ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

  


   #AndhraPravasi #SexWorkersRights #APSACS #NACONumbers #HumanRights #WomensDignity #StopStigma #SocialJustice #AndhraPradesh #FakeData #DemandAccountability #EmpowerWomen #SupportSexWorkers #RTIRevealsTruth #NACOCrisis #ProtectVulnerable #TransparencyNeeded #StopDataManipulation #WelfareForAll #JusticeForWomen #VoiceForVoiceless